రామ్ గోపాల్, పై కేసు నమోదు. .

  •  ప్రకాశం జిల్లాలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై సోమవారం కేసు నమోదైంది. ఆయన సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు చేసి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు ఐటీ మంత్రి నారా లోకేష్, కోడలు బ్రహ్మణి మరియు ఇతర టీడీపీ నాయకుల ప్రతిష్టకు భంగం కలిగించారని ఆరోపిస్తూ టీడీపీ మండల కార్యదర్శి రామలింగం ఫిర్యాదు చేశారు.
  • సబ్-ఇన్‌స్పెక్టర్ శివ రామయ్య మాట్లాడుతూ వర్మపై ఐటీ చట్టం ప్రకారం ఆన్‌లైన్ పరువునష్టం, డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లను తప్పుగా ఉపయోగించడం వంటి అభియోగాలు పెట్టారని తెలిపారు. ఈ ఆరోపణలపై దర్యాప్తు ప్రారంభించామన్నారు.
  • ‘వ్యూహం’ చిత్రం ఫిబ్రవరిలో విడుదల కావాల్సి ఉండగా, పలు వివాదాల కారణంగా మార్చిలో, ఎన్నికలకు కొన్ని వారాల ముందు విడుదలైంది. వివాదాస్పదమైన ఈ సోషల్ మీడియా పోస్టులు ఈ చిత్ర ప్రచార కార్యక్రమంలో భాగంగా చేశారని పేర్కొన్నారు. ఈ చిత్రం 2009లో హెలికాప్టర్ ప్రమాదంలో దివంగత మాజీ సీఎం వై ఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం, ఆ తరువాత ఆయన కుమారుడు వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపన నేపథ్యంతో తీసారు. జగన్ 2019 నుంచి 2024 వరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కొనసాగారు.
  • వర్మ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌పై కూడా గతంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు, ఇప్పడు ఆయన డిప్యూటీ సీఎం.

Post a Comment

0 Comments