అత్యాచారం చేసిన యువకుడిని బాదిన Siddipeta గ్రామస్తులు
September 29, 2024
సిద్దిపేట జిల్లాలోని కొమరవెల్లి మండలంలోని గురువన్నపేటలో ఓ బాలికపై అత్యాచారం జరగడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. 19 ఏళ్ల యువకుడు బాలిక ఇంట్లో ఆమె కుటుంబ సభ్యులు లేని సమయంలో ప్రవేశించి అత్యాచారం చేశాడు. విషయం బయటపడడంతో బాలిక కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు ఆ యువకుడిపై పోక్సో కేసు నమోదు చేశారు.
అయితే, యువకుడి కుటుంబం అక్కడి నుంచి పారిపోయింది. ఆగ్రహంగా ఉన్న గ్రామస్థులు, బాలిక కుటుంబ సభ్యులు యువకుడి ఇంటికి వెళ్లి పెట్రోల్ పోసి నిప్పు పెట్టారు, వాహనాలను ధ్వంసం చేశారు.
పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకునేందుకు రంగప్రవేశం చేసి, గ్రామస్థులను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు, కానీ వారు నిందితుడిని కఠినంగా శిక్షించాలన్న డిమాండ్ చేస్తున్నారు.
ప్రస్తుతం, నిందితుడు పోలీసులు అదుపులో ఉన్నట్లు సమాచారం, కానీ అధికారికంగా ఏ సమాచారం ఇవ్వలేదు. బాలిక కుటుంబ సభ్యులు నిందితుడి అరెస్టు పై స్పష్టత కోరుతున్నారు, పరిస్థితి ఇంకా ఉద్రిక్తంగా ఉంది
పోలీసులు అతనిని అరెస్ట్ చేస్తామని హామీ ఇచ్చినా, గ్రామస్థులు వినడానికి సిద్ధంగా లేరు.
0 Comments