ఆంధ్రప్రదేశ్ :
1. అమరావతి: మన తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతోపాటు మరియు కేంద్రపాలితమైన యానాంలో వాయువ్యదిశగా గాలులు వీస్తున్నట్ల వాతావరణ శాఖ కేంద్రం వెల్లడించింది.
2. నిన్న నైరుతి బంగాళాఖాతంలో కొనసాగున్న ఉపరితల ఆవర్తనం ఇవాళ నైరుతి, ఆగ్నేయ బంగాళాఖాతంలో సముద్ర మట్టానికి 3.1 నుంచి 5.8 మీటర్ల మద్యన కొనసాగుతున్నల్లు తెలిపింది.
3. దీని ఫలితంగా ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఇవాల్టి నుంచి 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఆవకాశం ఉన్నట్లు తెలిపింది.
4. మరియు కొన్ని చోట్ల ఉరుములతో కూడిన జల్లులు కురుస్తాయని చెప్పింది. ఒకట్రెండు చోట్ల 30కి.మీ నుంచి 40కి. మీ వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది.
తెలంగాణా :-
1. మరోవైపు రానున్న రెండు రోజులపాటు తెలంగాణలో కూడా అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
2. రానున్న మూడు రోజుల్లో పలుచోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని తెలిపింది. ప్రస్తుతం ఆవర్తనం నైరుతి, ఆగ్నేయ బంగాళాఖాతంలో సగటు సముద్ర మట్టం నుంచి 3.1నుంచి 5.8 కిలో మీటర్ల ఎత్తు మధ్య కొనసాగుతోందని వివరించింది. గాలులు దిగువ స్థాయిలో పశ్చిమ దిశనుంచి తెలంగాణ మీదుగా వీయడంతో వర్ష ప్రభావం ఎక్కువగా కనిపించే అవకాశాలున్నట్లు తెలిపింది.

0 Comments